హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి పేపర్ మిల్లు కాలుష్యంపై నిరసన

E.G: రాజమండ్రి పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శ్యామల సెంటర్ జంక్షన్ వద్ద నిరసన నిర్వహించారు. వేదిక అధ్యక్షుడు జేటీ రామారావు మాట్లాడుతూ.. పరిశ్రమల అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, గోదావరి నది భద్రతను పణంగా పెడుతున్నారని ఆరోపించారు.