MHBD: కోయ తెగ ప్రజలు ఉత్తర కార్తీ మొదటి పాదంలో జరుపుకునే కొత్తల (పెద్దల) పండుగను ఈ నెల 16న ఘనంగా నిర్వహించుకోవాలని ఆదివాసీ దొర పటేళ్ల సంఘం నేతలు పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెం మండల కేంద్రంలో గణేష్, బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి పండుగ ప్రాధాన్యతపై చర్చించారు. కొత్తల పండుగ సందర్భంగా ఈ నెల 16న ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరారు.
తెలంగాణ
'ఆదివాసీ కొత్తల పండుగకు సెలవు ప్రకటించాలి'


