హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మున్సిపాలిటీకి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలి'

MLG: ములుగు మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి భిక్షపతి ఆధ్వర్యంలో సోమవారం మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. నిధులతో మున్సిపల్ నూతన భవనం, మినీ ట్యాంక్‌బండ్, చిల్డ్రన్స్ పార్క్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, స్మశానవాటిక నిర్మాణం, పాటు వాహనాలు సమకూర్చాలని ప్రతిపాదించారు.