హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిచ్చి కుక్క దాడి.. ఐదేళ్ల బాలుడికి గాయాలు

E.G: దేవరపల్లి మండలం అచ్చియ్య పాలెంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై దాడికి తెగబడింది. ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు గోవర్ధన్ ముఖంపై కుక్క తీవ్రంగా కరిచింది. బిడ్డను కాపాడేందుకు వెళ్లిన తండ్రి చేతిని, అడ్డువచ్చిన తల్లిని సైతం విచక్షణారహితంగా కరిచేసింది. కుక్కల బెడదపై అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.