హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ

NTR: తిరువూరు పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి 28 వార్డుల ముసాయిదా ఓటర్ల జాబితాలను RDO, MRO, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రచురించారు. జాబితాలో మార్పులు, చేర్పులు ఉంటే ఫారం-2, 3లో దరఖాస్తు చేసి ఈ నెల 17 లోపు సమర్పించాలని కమిషనర్ మనోజ్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.