CTR: వినాయక చవితి సందర్భంగా యాదమరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్ట్ మాస్టర్ దామోదరాచారి వినాయకుడి చిత్రాలను విభిన్న రూపాల్లో రూపొందించారు. విష్ణురాజు, పూర్ణకుంభ లంబోదరుడు, అభయ విఘ్నేశ్వరుడు, శివ గణేష్, వీణా గణపతి చిత్రాలను యాక్రిలిక్ వాటర్ పెయింటింగ్ ద్వారా చిత్రించి ఆకట్టుకున్నారు. సృజనాత్మకతతో రూపొందించిన ఈ చిత్రాలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుడి రూపాల్లో సృజనాత్మకత


