హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఎనుమాముల మార్కెట్ పునఃప్రారంభం

WGL: నాలుగు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఇవాళ పునఃప్రారంభం కానుంది. శుక్రవారం అమావాస్య, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు, సోమవారం వినాయక చవితి సందర్భంగా మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. నేడు ఉదయం 6 గంటల నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా, రైతులు నాణ్యమైన సరుకులను మార్కెట్‌కు తీసుకొచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.