కృష్ణా: అల్పపీడన ప్రభావంతో మోపిదేవిలో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయం కావడంతో దేవస్థానానికి వచ్చే భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాభావంతో నీరులేక ఎండిపోతున్న వరి పొలాలకు వర్షం ఊరటనిచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. పంటలకు తేమ అందడంతో సాగు పనులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మోపిదేవిలో ఈదురుగాలులతో భారీ వర్షం


