హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెట్టుపై నుంచి పడి జనసేన నాయకుడు మృతి

కోనసీమ: రామచంద్రపురం మండలం హసన్బాదకు చెందిన జనసేన నాయకుడు గొలుసు శ్రీనివాస్ (47) ఆదివారం మామిడి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయన కుటుంబానికి పార్టీ తరఫున ఇన్సూరెన్స్ అందేలా చూస్తామని స్థానిక జనసేన నేతలు పేర్కొన్నారు.