హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

ములుగు జిల్లా యువతకు ఉపాధి అవకాశాల కోసం బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న ఆధ్వర్యంలో సత్యం స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా మూడు నెలల ఉచిత కంప్యూటర్, నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. సెప్టెంబర్ 19న ఆయన కార్యాలయంలో అవగాహన, నమోదు కార్యక్రమం నిర్వహిస్తారు. శిక్షణ సమయంలో భోజనం, వసతి, డ్రెస్‌లు, శిక్షణ అనంతరం, సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు.