హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుపడి మహిళ మృతి

PLD: పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెంలో పిడుగుపాటుకు గురై పందిటి కృష్ణవేణి (భర్త నాగిరెడ్డి) అక్కడికక్కడే మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురుస్తున్న సమయంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా ఈ విషాదం చోటుచేసుకుంది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.