హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ.. వృధాగా తాగునీరు

NRML: నర్సాపూర్ మండలంలోని 9వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో వేలాది లీటర్ల తాగునీరు రోడ్డుపై వృధాగా పోతుంది. రోడ్డుపై నీరు నిలిచి పరిసరాలు బురదమయంగా మారాయి. దోమలు, వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 6వ వార్డులోని పలు ఇళ్లకు నీరు అందడం లేదని వాపోయారు. వెంటనే లీకేజీలను అరికట్టాలని కోరుతున్నారు.