హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలి'

SRPT: మోతే మండల పరిధిలోని ఊర్లుగొండ గ్రామంలోని రామదండు బజార్ యువ యూత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని సోమవారం రాత్రి ఎస్సై లచ్చిరెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఎస్సై సూచించారు.