W.G: నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో భవానీ (36)పై భర్త రాము కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె పొట్ట ఎడమ వైపు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. కుటుంబ కలహాలతో పాటు డబ్బుల విషయంలో గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని కుటుంబ సభ్యులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసాపురం రూరల్ ఎస్సై కె. శారదా సతీష్ కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
భార్యపై కత్తితో దాడి.. కేసు నమోదు


