హైదరాబాద్: 28°C
తెలంగాణ

భర్త వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్

NRML: దస్తురాబాద్ మండలం కొత్త పెద్దూర్‌కు చెందిన పటేల్ స్నేహలత భర్త వేధింపులు భరించలేక సోమవారం కడెం లెఫ్ట్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సాయి కుమార్ తెలిపిన వివరాలు, భర్త శ్రీనివాస్ కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని పేర్కొన్నారు. మృతురాలి తండ్రి వెంకటేశ్ ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.