హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్సవాల సందర్భంగా అలరించిన సంగీత విభావరి!

NRPT: కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం హిందూ ఉత్సవ సమితి సభ్యులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు దర్శించుకున్నారు. అనంతరం కళాకారులతో సంగీత విభావరి నిర్వహించారు. భక్తులు, పట్టణవాసులు ఆసక్తిగా తిలకించారు. మండలంలోని గ్రామాల్లోనూ వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరారు.