NRML: నిర్మల్ పట్టణంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్, బుధవార్ పేట్, చింతకుంటవాడ, పంజేషాగల్లీ, నగరేశ్వరవాడ, గుల్జార్ మార్కెట్, ఇస్లాంపుర పరిసరాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా కోత విధిస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


