NGKL: తెలకపల్లి మండలం వట్టిపల్లికి చెందిన ఎద్దుల రఘు కుమారుడు సంతోష్ (16) అదృశ్యమయ్యాడు. తెలకపల్లిలోని ప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో ఉంటూ 9వ తరగతి చదువుతున్న సంతోష్ సెప్టెంబర్ 5న తెల్లవారుజామున 5 గంటల నుంచి కనిపించడంలేదని వార్డెన్ తెలిపారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
తెలంగాణ
విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు


