హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సన్న రకాల వరి రైతులకు నేడే చివరి అవకాశం'

MNCL: సన్న రకాల వరి సాగు చేసి ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు నేటిలోగా సంబంధిత విత్తన దుకాణాల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అఖిల్ తెలిపారు. రైతుల కోసం నమోదు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. నేటితో గడువు ముగియనున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.