MNCL: కాసిపేట మండలం దేవాపూర్‌లో మతసామరస్యం వెల్లివిరిసింది. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 12వ వార్డు సభ్యురాలు షేక్ నసీమా షఫీ వినాయకుడికి లడ్డూ ప్రసాదం అందజేశారు. కులమత భేదాలు లేకుండా పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ
VIDEO: లడ్డూ ప్రసాదం అందజేసిన షేక్ నసీమా


