హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కమిటీ సభ్యులు బాధ్యతగా ఉండాలి'

E.G: నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో సీఐ రవికుమార్, ఎస్సైలు ఆంజనేయబాబు, శివగణేశ్ వినాయక మండపాల కమిటీలతో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. వినాయక నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు బాధ్యతగా ఉండాలని సూచించారు. అసభ్య నృత్యాలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.