హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ మండపాల వద్ద పోలీసుల భద్రతా తనిఖీలు

ATP: వినాయక చవితిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ భద్రతా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో అధికారులు గణేష్ మండపాలను పరిశీలించారు. నిమజ్జనం సమయంలో పోలీసు అనుమతించిన మార్గాల్లోనే ఊరేగింపు సాగాలని, కేటాయించిన ఘాట్ల వద్దే విగ్రహాలు నిమజ్జనం చేయాలని సూచించారు.