హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంకుడు గుంత వినాయకుడితో పర్యావరణ సందేశం

JGL: పర్యావరణ పరిరక్షణతో పాటు భూగర్భజలాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కోరుట్ల మున్సిపాలిటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంటికో ఇంకుడు గుంత.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం’ అనే నినాదంతో ఇంకుడు గుంత ఆకృతిలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ వసంత తిరుమల, ఇంఛార్జ్ కమిషనర్ అరుణ్ కుమార్, అధికారులు, పూజలు నిర్వహించారు.