హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

KDP: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మలమడుగు పట్టణంలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెహ్రూనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గణనాథుడిని ప్రార్థించారు.