హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్‌లో ఘనంగా వినాయక పూజలు

KNR: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సమేతంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని ప్రార్థించారు.