హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17ను నిర్వహించాలి'

JGL: తెలంగాణ చరిత్రకు ప్రతీకగా నిలిచిన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవంగా ప్రకటించాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రిపెళ్లి సత్యం డిమాండ్ చేశారు. సోమవారం పెగడపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్‌రెడ్డి, కొమురెల్లి, గట్టయ్య పాల్గొన్నారు.