హైదరాబాద్: 28°C
తెలంగాణ

వింత సీతాకోకచిలుక ప్రత్యక్షం!

KMR: మద్నూర్‌లోని ఓ ఇంట్లో సైనిక దుస్తులను పోలి ఉన్న వినూత్న సీతాకోకచిలుక కెమెరాకు చిక్కింది. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులను వివరణ కోరగా.. ఇది 'ఒలియాండర్ హాక్-మాత్' రకానికి చెందినదని తెలిపారు. దీని శాస్త్రీయ నామం 'డాఫ్నిస్ నెరి' అని పేర్కొన్నారు. దీని రెక్కలపై ఉన్న ఆకుపచ్చ, గులాబీ, గోధుమ రంగుల డిజైన్ సరిగ్గా మిలటరీ సైనికుల కామోఫ్లేజ్ యూనిఫాంలా ప్రతిబింబిస్తుందన్నారు.