WGL: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి PA మహేందర్ రెడ్డి, PRO మహేష్‌పై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తన ట్విట్టర్లో Xలో తీవ్రంగా ఖండించారు. సైఫాబాద్ PSలో పోలీసుల సమక్షంలోనే వారిపై దాడి జరగడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అండతోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు.
తెలంగాణ
'కేటీఆర్ వ్యక్తిగత సిబ్బందిపై జరిగిన దాడి దుర్మార్గం'


