హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత సామరస్యానికి ప్రతీకగా గణేష్ వేడుకలు

అన్నమయ్య: పెద్దమండ్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. రామాలయం వీధిలో ప్రతిష్టించిన గణేష్ విగ్రహాన్ని షాహీనూర్ అనే ముస్లిం మహిళ విరాళంగా అందించడం హిందూ, ముస్లింల ఐక్యతను చాటింది. వేడుకల్లో ఇరువర్గాలు కలిసి పాల్గొనగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో తెహీరా అనే చిన్నారి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.