SRCL: రుద్రంగి పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రుద్రంగిలో రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు


