BHPL: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు చెరువుల పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్ చేశారు. ఇవాళ కాటారం మండలంలోని చెరువులను పరిశీలించిన ఆయన, మంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాటారం-మంథని రహదారి అధ్వానంగా మారిందని, పనులు చేయకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
రైతుల పక్షాన ఉద్యమిస్తా: మాజీ ఎమ్మెల్యే


