MDK: కౌడిపల్లి మండల పరిధిలోని ఎర్రమట్టి తండా నుండి రంగంపేట వెళ్లే మట్టి దారి అధ్వానంగా తయారైంది. ఆదివారం పడిన వర్షానికి దారంతా బురదమయమై గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయని తండావాసులు వాపోతున్నారు. ఏడాది కాలంగా ఈ నరకాన్ని అనుభవిస్తున్నామని ఆవేదన చెందుతూ, అధికారులు తక్షణమే స్పందించి రోడ్డును బాగు చేయాలని వేడుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: నరకప్రాయంగా రంగంపేట ప్రయాణం


