NRML: లోకేశ్వరం మండల కేంద్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో గణనాథుడి విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. గణనాథుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినాయకుడి నామస్మరణతో మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: లోకేశ్వరంలో కొలువుదీరిన గణనాథుడు


