MLG: మంగపేట మండలం పాలయిగూడెం ర్యాంపు సమీపంలోని ప్రధాన రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లోడింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీలను రోడ్డుపక్కన నిలిపి లోడింగ్ చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. ప్రశ్నించిన వాహనదారులు, స్థానికులతో సిబ్బంది గొడవకు దిగుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: రోడ్డుపైనే ఇసుక లోడింగ్..!


