హైదరాబాద్: 28°C
తెలంగాణ

పినపాక అభివృద్ధికి HAM నిధులు

BDK: పినపాక నియోజకవర్గంలో బీటీ రోడ్లు, వంతెనల అభివృద్ధికి రూ.186 కోట్ల HAM నిధులు మంజూరు అయ్యాయి. దీనిపై మణుగూరు మండల కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ.. సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో గ్రామీణ రహదారులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆనందం వ్యక్తం చేశారు. దసరాలోపే పనులను ప్రారంభించాలని వారు కోరారు.