హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలుడిపై కోతుల దాడి

MLG: ఏటూరునాగారంలో కోతుల బెడద తీవ్రంగా మారింది. గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బస్టాండ్ సమీపంలో దర్షిత్ అనే బాలుడిపై దాడి చేసి పలుచోట్ల గాయపరిచాయి. వేల సంఖ్యలో కోతులు పట్టణంలో సంచరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారు.