హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌కు లడ్డూ వేలం గొడవ!

MHBD: కేసముద్రం పరిధి NTR నగర్‌లో గణేష్ లడ్డూ వేలం డబ్బుల వ్యవహారం వివాదంగా మారింది. రూ.1.16 లక్షలకు లడ్డూను దక్కించుకున్న వ్యక్తి నగదు చెల్లించకుండా, బకాయి అడిగిన ఉత్సవ కమిటీ సభ్యులను బెదిరిస్తున్నాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.