MDK: రామాయంపేట మండలం సుతార్‌పల్లి గ్రామంలో భారీ వర్షాలకు కాలువ ఉప్పొంగి రహదారి తెగిపోవడంతో నీరు ఇళ్లలోకి చేరింది. సమాచారం అందుకున్న సర్పంచ్ మద్దూరి సునీల్ తక్షణమే స్పందించి జేసీబీతో మరమ్మతులు చేయించారు. నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించి ముంపును నివారించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాదగిరి, వార్డు సభ్యులు రాగి అశోక్, మహేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
తెగిన రహదారి.. నీటి ప్రవాహం మళ్లింపు


