హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలి'

NGKL: లింగాల మండలం దారారం, క్యాంపు రాయవరం, రాయవరం, వడ్డేరాయవరం, యాపట్ల గ్రామాలకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు స్పందించాలని కోరారు.