SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లోని మోయతుమ్మెద వాగులో వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఈ వర్షాకాలంలో తొలిసారిగా వాగుకు నీటి ప్రవాహం వచ్చిందని సర్పంచ్ ఎర్రల జానకి తెలిపారు. వాగు నీరు లోయర్ మానేరు డ్యామ్‌లోకి చేరుతుందని, దీంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. వాగుకు జలకళ సంతరించుకోవడంతో రైతులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
వాగుకు జలకళ


