హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదలకు భూమి పంపిణీ చేయాలి: సీపీఎం

NGKL: పెంట్లవెల్లి మండలం మాంకాలమ్మ మిట్టలోని 14 ఎకరాల 36 గుంటల భూమిని పేదలకు ఇంటి స్థలాలుగా పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసినా ఇప్పటివరకు పంపిణీ చేయలేదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.