BHNG: తుర్కపల్లి మండలంలోని దత్తాయిపల్లిలో సోమవారం శ్రీ సురమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి వారికి ఘనంగా బోనాలు నిర్వహించారు. మహిళలు బోనాల్లో నైవేద్యాలు వండి తలపై ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల శిగాలు, పోతరాజుల ఆటల మధ్య ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా కంఠ మహేశ్వర స్వామికి బోనాలు


