NLG: మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారులో సోమవారం కారు అదుపుతప్పి బోల్తాపడింది. నల్గొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న పంట పొలంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కారు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం


