హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై వర్షపు నీరు

SRPT: మేళ్లచెరువు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు నిలిచిపోవడంతో రహదారి దెబ్బతినే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటిని తొలగించి, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.