హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక చవితిని పర్యావరణహితంగా నిర్వహించాలి'

ADB: వినాయక చవితిని పర్యావరణహితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ విద్య విభాగం ఆధ్వర్యంలో పీడీ మెప్మా, డీఆర్డీఓల సమన్వయంతో జిల్లాలో 2 వేల మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు.