హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై తొలగించిన వరద నీరు

SDPT: బెజ్జంకి మండలం కల్లెపల్లి-బెజ్జంకి రహదారిలోని అంగడి మడుగు వద్ద భారీ వర్షాలతో వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ పాలకవర్గం వెంటనే స్పందించి జేసీబీతో కాల్వలు తీయించింది. దీంతో వరద నీరు పక్కకు మళ్లి రాకపోకలు పునరుద్ధరించాయి. సర్పంచ్ బిగుల్ల మోహన్, ఉపసర్పంచ్ వినీత్ గౌడ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.