హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

SDPT: దుబ్బాక కాంగ్రెస్ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సూచనలతో 14వ వార్డుకు చెందిన చింతల స్రవంతికి సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సాయం అందజేశారు. రూ.39 వేలు, రూ.60 వేల చెక్కులను కౌన్సిలర్ తునికి సురేష్ లబ్ధిదారుకు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల భరత్ పాల్గొన్నారు.