WGL: నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో దుగ్గొండి సీఐ శంకర్ రావు సర్పంచులతో, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పలువురు సర్పంచులు పాల్గొన్నారు.
తెలంగాణ
గణపతి ఉత్సవాలపై సీఐ సమీక్ష


