SDPT: హుస్నాబాద్ ఎగువన కురిసిన వర్షాలతో హుస్నాబాద్‌లోని చారిత్రక ఎల్లమ్మ చెరువు నిండుకుండను తలపిస్తోంది. వరద నీరు పోటెత్తడంతో చెరువు జలకళను సంతరించుకుని నయన మనోహరంగా మారింది. ఈ దృశ్యాలు స్థానికులకు కన్నుల పండుగగా నిలుస్తున్నాయి. సమృద్ధిగా నీరు వచ్చి చేరడంతో రానున్న పంట కాలానికి సాగునీటి కొరత తీరుతుందనే ధీమాతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది.
తెలంగాణ
VIDEO: ఎల్లమ్మ చెరువుకు వరద పోటు


