హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్

WGL: జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో కలెక్టర్‌ డా. సత్య శారద అధికారులు అప్రమత్తం చేస్తూ.. టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యంగా వర్ధన్నపేట, రాయపర్తిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగుల వద్ద నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని, హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.